STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

మన ధ్వజం

మన ధ్వజం

1 min
10

మన ధ్వజం 
( వచన కవిత )

అదిగో మన ధ్వజమా ధ్వజమున కలదొక ధర్మచక్రం.
సదసద్విజ్ఞానము నందించే చైతన్య స్ఫూర్తిచక్రం.

ఇరువది నాలుగాకుల భరతమాత వైభవపు చిహ్నం.
పరమార్థమును బోధించే తత్వసార సుపథచారణం.

శౌర్యధన సంయుతమౌ సాహసాని కదియొక నిదర్శనం.
సర్వజ్ఞతను చాటి చెప్పు జాతిసమైక్యతకది నిర్వచనం.

 విశ్వాసమే మనశక్తి యనుచు నుద్ఘోషించు దీపికా ప్రకాశం.
విశ్వానికే విజేతలమనుచు వీర సైనిక విన్యాస పాటవం.

ఎగురుతున్న జెండాలో తిరుగుచున్నదీ నీలివర్ణపు చక్రం.
తరతరాల సంస్కృతిని వారసుల కందించే పరంపరం.

దివ్యజ్ఞాన సంధాయినిగా నిల్పు దేశమాత కెనలేని గౌరవం.
భవ్యమైన ప్రగతి బాటలో సాగిపోవును మన భావితరం.

 జాతికి బాసటగా నిలబడు వారి దీక్షకిదే సోపానం.
నీతిమంతుల హృదిలో నిత్యపూజ లందుకొనే దైవం.

త్యాగధనుల జీవన సాఫల్యాన్ని సన్నుతించు భక్తి నివేదనం.
వేగముగా పర్వులెత్తు నభివృద్ధికి సూచకమౌ విజయవిలాసం.

వెలుగుతోంది వెలుగుతోంది వినువీధిలో దేశ సార్వభౌమత్వం.
విలువ తెలిసి పౌరులెల్ల నర్పించాలి సతము వందనశతం.//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics