దేశభక్తి - కవితా గీతం
దేశభక్తి - కవితా గీతం


దేశ భక్తి - కవితా గీతం
పల్లవి : తల్లీ భారతికి వందనం - స్వర్ణ భారతికి వందనం
విశాల భారతావని జగద్విదిత - దేశ మాత కు వందనం || తల్లీ భారతి ||
చరణం 1. కర్మ యోగులను , మహా యోధులను కన్నతల్లి అభినందన చందనం
మార్గ దర్శులను , కార్య దర్శులను కాంచిన భారతావని కీర్తి నీరాజనం
స్వ తంత్య్ర దేశ ప్రజల ప్రగతి పథాన్ని చూపిన నవ నవోన్మేష వందనం
భారత దేశ సౌందర్య ప్రదేశ మాత రూపం హర్షోల్లాస ఆనందాతిరేకం || తల్లీ భారతి ||
చరణం 2. తెలుగు దేశ ప్రగతికి సేద్య సంపద ప్రణాళిక - కలలే నిజాలయ్యే తరుణం
దేశ సాంకేతిక అభివృద్ధి స్వర్ణ సిరి - జన చైతన్య సహయోగమే విజయ పథం
స్వర సుస్వర కవి గాయక గీత మాలికల - అభినందనల గాత్ర నీరాజనం
సురుచిర స్వర్ణ భారతి శిక్షణ శిబిరాల - నైపుణ్య యువజన కీర్తి వైభోగం || తల్లీ భారతి ||