STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Crime

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Crime

లఘు కవితలు :అంశం : దాడి .01.11. 23:జయంత్ కుమార్ కవీశ్వర్

లఘు కవితలు :అంశం : దాడి .01.11. 23:జయంత్ కుమార్ కవీశ్వర్

1 min
304


జీవన విధానం పై ఆధిపత్యం సాధించే క్రూరత్వం

స్వార్థపరత తోనే మారణహోమాన్ని సలిపేయుద్ధం

పర్యావరణ రక్షణను మరచి నీతిమాలిన తీవ్రవాదుల

శత్రుత్వంతో విస్తరించిన మానవత్వ రక్షణకు దారేది?

కులమత వర్ణ, వర్గ పట్టింపులు లేని మానవత్వము

పర్యావరణ రక్షణ అభివృద్ధి పథంలో పయనము

మారణ హోమాన్ని ఆపి శాంతిని పృథ్వీ తలమున నెలకొల్పగ లేరా?

జీవజాలాన్ని రక్షింపగా లేని కాఠిన్యాన్ని కల్గిన ముష్కరులు

సాటి మానవుల హింసలచే నెలకొన్నతీవ్రవాద కఠినాత్ములు

మారాలి సమాజ హితమునకు చేయూతనివ్వాలి సౌమ్యముగా

హింస మార్గాన్ని విడిచి వెలుగొందాలి దివ్యాత్ములుగా ప్రజల హృదయాలలో.



Rate this content
Log in

Similar telugu poem from Abstract