STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Classics

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Classics

అంశం: గ్రీష్మమా ! ఇంతభీష్మమా ! కవీశ్వర్ జయంత్ కుమార్

అంశం: గ్రీష్మమా ! ఇంతభీష్మమా ! కవీశ్వర్ జయంత్ కుమార్

1 min
3

05 . 05. 2024 

వచన కవితా సౌరభం 

అంశం: గ్రీష్మమా ! ఇంతభీష్మమా !

రచన : కవీశ్వర్  జయంత్ కుమార్ 

శీతలపవనం ఉదయాన్నే పయనించే ఆమడ దూరం 

ఇనుఁడేమో మొదలిడె ప్రభాతాన చూపించే తన ప్రతాపం 

పసి పిల్లలకు తట్టుకోలేని ఉక్కపోత చెమటతో ఎండఉబ్బరం

స్త్రీ బాల వృద్ధులు ఎండా కాలం వేడి వల్ల ఇంటికే పరిమితం 

            ఆవిధంగా ఉన్నపుడైనా విద్యుచ్చక్తి సరఫరా లో అంతరాయం 

           ఆ ఇంట్లో ఉండే వారి బాధ యంత్రాల మొరాయింపు తో వర్ణనా తీతం 

          కుటుంబ పెద్దల కార్యాలయనికి చేరిక శీతల పానీయాలతో సహవాసం 

         వడ గాల్పుల వేగం వారి శరీరాల పెంపు తో జన సమ్మర్దన చక్ర వ్యూహం 

ఈ మూడు మాసాల తాపాన్ని తట్టుకోలేక పోవడం ప్రజల పనుల సమాహారం 

వడగండ్ల వానచే హరియించును కోతకొచ్చిన పంటలు రైతుల కన్నీటి సారం 

కష్టాలలో పడద్రోసె సూర్య సహిత వేడి వాయు తరంగాల చుర చుర ప్రకోపం

తప్పని సరిగా తప్పక అనుసరించు , అనుభవించు ఎండాకాల కష్టాల కాపురం .

          సాయంకాలం చండ ప్రచండుని తీవ్రత కొంచెం మనకు ఉపశమించడం

          చిన్నా పెద్ద అందరు కలిసి ఈత కొలనులు సందర్శించి తగ్గించు తాపం 

          వ్యహ్యాళికి ప్రణాళికలతో కుటుంబము మొత్తం చిత్రంగా వేడిని తగ్గించేశాం 

          రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ సకల జీవ రాశులను హెచ్చెను పరి తాపం.

 


Rate this content
Log in

Similar telugu poem from Abstract