STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

పర్యావరణం

పర్యావరణం

1 min
15

పర్యావరణం 
(వచన కవిత)
******************

పాదపంబులు లేని పట్టణపు ప్రాంతములు
కాంక్రీటు మయమయిన కాలుని నివాసములు.

నిర్మలంబగు జలము నేడు కరువైపోవ
గొంతెండి నీల్గుచు కుములు చుండిరి జనులు.

ప్లాస్టిక్కు వాడకము పలు రోగముల దెచ్చె
కలుషితంబగు గాలి కాల్చు చుండెను సతము.

ధనముపై నాశతో ధరలోన జీవించి
వనములను కాల్చుచూ వసుధనే ముంచితే

దీనతను బొందుచూ దిగులుతో తిరుగాడు
ప్రాణికోటికి రేపు భావి యెటులుండునో?

పల్లెలను విడనాడి పశువులను తెగటార్చి
పట్టణంబుకు చేరి ప్రజలు భారంబుగా

జీవనంబులు గడుప క్షేమంబు కల్గునా? 
జనులు నిరతంబుతామశాంతితో బ్రతుకరా?

పక్షులెచ్చట కలవు? పశువులేవీ? లేవు!
ప్రకృతి రోదించుచూ ప్రళయంబుతో ముంచు.

గతిమారి ఋతుచక్ర కాలంబు ద్రిమ్మరగ
పొగలు గ్రక్కుచు మండి పుడమి భయపెడుతుంది.

 వినవోయి మానవా!పృథ్వినే బ్రతికించు!
కనుమోయి విబుధుడా!కాలమును గమనించు!

ప్రకృతిని ప్రేమించు!వసుధనే రక్షించు!
చెట్టు చేమలు పెంచు!శ్రేయంబు చేకూర్చు!

సజ్జనాత్ముడవగుచు జగతికై తపియించి
మానవాళికి నీవు మంచిమార్గము చూపు!//


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics