STORYMIRROR

Sandhyasharma yk

Inspirational

5  

Sandhyasharma yk

Inspirational

అవిశ్రాంత పథికుడు

అవిశ్రాంత పథికుడు

1 min
411

అవిశ్రాంత పథికుడు


లేలేత పూల తీగలా నేనాతని 

పాదాలనల్లుకుపోతుంటే...

ఓ బోధి వృక్షమై విస్తరించి

ప్రకృతినొక పాఠశాల చేసి

నలుదిక్కుల నల్లబల్ల మీద

శ్వేత వర్ణాక్షర జలపాతమై

పారే సెలయేరులా


తూరుపు పశ్చిమ కనుమలకు

బార చాపితే

సూరీడై నా చెవుల్లో సుద్దుల్ని 

నూరిపోసిందతడు...


అక్షర లోకపు దారుల వెంట

పయనిస్తుంటే అనంతమైన ఇంద్రధనస్సులు

కనికట్టు చేసే ఎండమావులను పరిచయం చేసి

బీడునేల మీద నా చూపుడు వేలుతో

బీజాక్షరాల విత్తు నాటిందాతడే...


ఒంటరి ప్రయాణానికి సూచికగా

అండదశ నుంచి ఆకాశ గమనం వరకు

చిటికెన వేలుపట్టి ఆతని అడుగు జాడల్లో

లేత పెదాల మీద పదాల తుళ్ళింతై

నా చిన్ని ఎడారి గుండెల్ని తడిపి 

మనసు మాగాణి మీద పచ్చదనాన్ని

పులిమిందాతడే....


రెక్కలొచ్చి నేనెగిరిపోతుంటే

దిక్కుదిక్కునా తనే

వెన్నుతట్టి ఒక్కొక్క మెట్టు నన్నెక్కిస్తూ

ఆఖరిమెట్టు మీద అతడే...


ఆతని అనంతమైన కరుణ ముందు

అవని చిన్నబోయి...

ఋణం తీర్చలేని... మాతృభూమిలో

తరాల చరితల్ని జ్ఞాన వాహినిలో 

తడుపుతూసాగే

జాతికి జీవ దాతువై 

దారి చూపే వెలుగు కాగడాలోని

అవిశ్రాంత పథికుడతడు!



Rate this content
Log in

Similar telugu poem from Inspirational