STORYMIRROR

Bhagya sree

Inspirational

4  

Bhagya sree

Inspirational

చలం

చలం

1 min
546



ఛీ చలం అన్నా!

మా చలం అన్నా!

చలం చంచలం

అరుణాచలాన అచంచలం

సాహితీ ప్రక్రియల ప్రభంజనం

విమర్శలే సన్మానం

ఆంధ్ర దేశం విసిరి వేసిన అమూల్యమైన

సాహిత్యాణిముత్యం

దయార్ద్ర హృదయం కరుణాంతరంగం

ఆడవారికి బుర్ర ఉందని చెప్పిన చలం

నువ్వెక్కడ?

నీ సాహిత్యం విశృంఖలత్వానికి ప్రేరేపణా?

కాదు చలం !

తమ తప్పిదాన్ని ఒప్పుకోక

నీ పై మోపిన మూకుమ్మడి నెపం

నీ పదాలకు బానిసలై చీకటి మాటున ఇరుకు హృదయాలతో చదివిన వారికేం తెలుసు వాటిలోతు

మాకు

తీయని "ప్రేమలేఖలు" రాసే దెవరు

మదిని తవ్వే"మ్యూజింగ్స్" రాసేదెవరు

"పువ్వు పూసింద"ని చెప్పెదెవరు

"బుజ్జి గాడు" కిలకిలలు "మైదానం"లో ముచ్చటించెదెవరు

నిక్కచ్చిగా నిజాయితీ గా నగ్నసత్యంగా "ఆత్మకథ" నీలా రాసేదెవరు

కథలు, కాల్పానికలు,

నాటికలు, గల్పికలు,

సినిమాలు, నవలలు,

గీతాంజలి, క్రీస్తు సువార్తల అనువాదాలు

ఇలా ఎన్నెన్నో నీ కలం నుంచి జాలువారిన సాహితీ మణిపూసలు సంఘానికవి విద్రోహులు... ఆశ్చర్యం చలం!

కానీ అవే అవే ఆ సంఘంలోని పాఠకుల మది దోచిన పద విన్యాస కన్యకలు.. ఎంత ఆశ్చర్యం చలం!

ముని గా మారిన కాముని వా

"బిడ్డల శిక్షణ" చెప్పిన బాలుడివా చలం

ఎవరికి అర్థం అవుతావు చలం

విధాత గీసిన యదార్థానివి

చలం!

నువ్వు ఎందరో అనాథలను అక్కున చేర్చుకుని "నాన్న" అని పిలిపించుకున్నా వంటే

నీ పదాల రసికతకు అలవాటు పడ్డ జనం పెడార్థం తేస్తారేమో చలం.. 

ానీ ప్రతి పదంలో సమానత్వమనే నిగూఢార్థం నిబిడించిన నీ మానవత్వాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు చలం..

స్వర్గం లో అయినా లౌక్యం తెలుసుకున్నావా

లేక రంభ ఊర్వశి మేనకలనుఉద్ధరింపదలచి

వెలివేయబడ్డావా !

పొరపాటున పోనీలే అని పంతం వీడి

ఆంధ్రదేశానికి రాకుమా

చలం! జర భద్రం

కాలం మారింది

వారి బాధని భావాన్ని వెళ్లగక్కలేక మగమహారాజు లు

నీలాంటి కవి కోసం వెతికి వేసారుతున్నారు

కానీ చలం

వారికేం తెలుసు నువ్వు స్త్రీవాదివి కావని

అంతరంగవాదివని

దయార్ద్ర మూర్తివని

చలం! నీ కలం

సమ్మొహనం

అజరామరం

అందుకే

నీ ఆత్మజ్ఞానం ముందు తానెంతని "జ్ఞానపీఠ్"

నీ పద సౌకుమార్యం ముందు మేమెంతని "పద్మాలు"

చర్చించుకున్నవేమో

"నోబెల్" మనసుకు నేనెందుకని "నోబెల్" మనొగతమేమో

కాని చలం!

చెట్టు పుట్టలకి పశు పక్ష్యాదులకి పూజించే

అలవాటు పడ్డ మాకు

మనుషులకి వారి మనసులకి విలువివ్వమన్న

నీ వాక్యాలు రుచించక ఆంధ్ర దేశాన వెలివేస్తే అరుణాచలాన బ్రహ్మైక్యం పొందిన కవీశ్వరుడువి

ఇక నీకీ పొగడ్తలకు పనికి వచ్చే పద్మాలు, పాఠ్యాంశాల ప్రశ్నల్లో మిగిలిపోయే జ్ఞానపీఠ్ లు, పలుకుబడి పెంచే నోబుల్ లు అవసరమా చలం..

ఆ అరుణాచలేశ్వరుడే తన ఒడిన చేర్చుకుని

ఆత్మసాక్షాత్కారంతో చేసె

అనన్య సామాన్య మైన ఘన సత్కారం..


                



Rate this content
Log in