STORYMIRROR

Bhagya sree

Tragedy

4  

Bhagya sree

Tragedy

కవ్వింపు

కవ్వింపు

1 min
417

నా చూపులు కవ్వింపులు

నా మాటలు కవ్వింపులు

నా నవ్వులు కవ్వింపులు

నా నడకలు కవ్వింపులు

కర్మ , నా మౌనమూ కవ్వింపే


ఇంత కవ్వింత ఉందా నా ఒళ్లంతా

చూసే ఆ కళ్ళదా ఆ పైత్యమంతా


కావలి కాసే కళ్ళకి

ఇంట్లో అలంకారాన్ని

అనధికార అధికారాన్ని

గడవక గడపదాటిన

నా ఉనికిని చాటగా

ఆశగ ఎగిరినా

కబళించే కార్చిచ్చుకి

కవ్వింపుల కళేబరాన్ని


నీచపు చూపుల

పల్లికిలింపు మాటల

పాశవికపు చేష్టలను

పంట బిగువున భరిస్తూ

కాండ్రింపులు కనబడనివ్వని

నేనే

విధాత గీసిన సిసలైన కవ్వింపుని

                    



Rate this content
Log in

Similar telugu poem from Tragedy