ఎదురుచూపులు
ఎదురుచూపులు




పచ్చదనాల చీర కట్టి
నీ నులి వెచ్చని
వెన్నెల ఊహల
ఊయలలో ఊగుతున్నా
నా కలలన్నీ మూటగట్టి
నా చూపుల మెరుపుల
వలపు గాలిలో
కబురంపా
అందుకొని ఎదురొస్తావో
అందనని మురిపిస్తావో
నీకేం మహారాణి
నాకెన్ని రాచకార్యాలని
కవ్విస్తావో
ఏమొ, ఏలనో
తప్పక నువ్వొస్తావని
తెలిసినా
నా ఎదలయ
ఎదురుచూడడం మానదు
ఎందుకనో?