ధృతరాష్ట్ర కౌగిలి
ధృతరాష్ట్ర కౌగిలి


ఏమంత నీరసం ?
వాట్సప్ చేసా !
కళ్ళు ఎరుపెక్కాయి?
యూట్యూబ్ చూసా !
ఏంటి నొప్పి సెల్ఫీ తీసా అవి చూసా
అబ్బా !ఎంత గర్వము సామాజిక మాధ్యమాలలో బంధాలు బలపడి లైకులు పడి పడి వస్తున్నాయా
సర్వేంద్రియాలు చిందరవందర అయితే గాని నీకు బుద్ధి రాదా
నిన్ను తట్టి లేపడానికి శ్రీశ్రీ రావాలా
మనుషులంటే మట్టికాదోయ్ అని గురజాడ చెప్పాలా వివేకానంద సూక్తులు చదవాలా
అవన్నీ
నరనరాన ఛాందస భావాలు నిండి నీరసించిన సమాజాన్ని లేపడానికి
అంతేగానీ
ఉరకలేసే ఉడుకు నెత్తురు ఉత్సాహాన్ని పబ్ జి వర్చువల్ వరల్డ్ కి దారాదత్తం చేసే నిన్ను లేపడానికి కాదు
వేళ్ళు స్మార్ట్ ఫోన్ కి
ఒళ్ళు సోఫా సెట్ కి
కళ్ళు ఇంటర్నెట్ కి ఇచ్చే నిన్ను లేపడానికి క
ాదు
ఇంకా ఎంతసేపు మరి కాసేపు మరి కాసేపు అని నీ మనసుకి చెప్పి కూర్చుంటావు
లే లే లే లే
నిన్ను నువ్వు నియంత్రించుకో
నువ్వు నువ్వుగా జీవించు
వర్చ్యువల్ వరల్డ్ అనే ఈ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయటపడి
నిన్ను నువ్వు మేలుకొలుపు కో
నిన్ను నువ్వు ఉద్ధరించు కో ... లే