కరోనా కాలం
కరోనా కాలం


వినరా వినరా, నేను చెప్పేది వినరా
మాయ చేసి వచ్చింది, మనుషులోకి దూరింది
నొప్పేదో రేపింది, ముంచేసి పోయింది
నిన్ను మర్చిపోవకురా, మడిచేసి పోతదిరా
మాస్క్ విడిచి పోవకురా, లైఫ్ బెండ్ తీస్తాదిరా
గుంపులని గబ్బు చేసే గబ్బిలాల గోల రా
ధనికయినా పేద అయినా కనికరము లేదురా
లైఫ్ లేనో రిస్క్ పెట్, లవ్ లేనో మట్టు పెట్
ఇంటిలోనే ఉండరా, బయటకొద్దు ముందరా
ఒకలైన చాలురా, వందమంది వణుకురా
చదువులన్ని ఆగేరా, చట్టం మొత్తం మారేరా
జాబు లెనో ఊడేరా, జబ్బులేనో పెరిగేరా
మస్తు మాటలు ఆడకురా, మౌనమే మందురా
మస్తు మాయ చేసింది, మొత్తం చుట్టూ ముట్టింది
ప్రపంచాన్ని పాలించే, ఫాయిజనియె చిమించే
కనీర్లను కారించే, కౌగిలినే కడతేర్చేయ్
దగ్గరైన బంధాలే, దూరంగా బంధించే
వైద్యుల వేదాలే, వరంలా కనిపించే
రక్షణ రంగాలే, నిద్ర మరిచి రక్షించే
మిత్రులనే శత్రువులై, కొత్త రంగులు చూపించే
కాస్త కూడు కోసమే, కోట్ల అడుగులు కదిలినడిచే
భయం ఏమో ముందు నిలిచే, బందమేమో వెనుక పొడిచే
మనిషేమో మట్టికలిసే, మానవత్వం మంట్టగలిసే
వినరా వినరా, నేను చెప్పేది వినరా
విధి ఆటను మరచిపో, విశ్వాసం నిలుపుకో
కష్టాలను ఓర్చుకో, కానీలను తుడుచుకో
వస్తుందో అవకాశం, ఓర్పుతో గెల్చుకో
నిన్ను నువ్వు నమ్ముకో, విజయాన్ని చేరుకో