నాన్నకు ప్రేమతో....
నాన్నకు ప్రేమతో....


రెండు అక్షరాలా పదం
నీ కణంతో పుట్టిన ఆ క్షణం
అదృష్టం తాకింది తక్షణం
నీ కౌగిలితో మారిన నా శైలి
అప్పుడే మొదలయినది నా మజిలీ
నీ సంరక్షణతో నన్ను శ్రీమంతుడిని చేశావ్
నీ పాదాలతో నడిపించి నన్ను నాదుడిని చేశావ్
నా కష్టాల ఆహ్వానాన్ని నీ ఇష్టాలుగా ఆదరించావ్
నీ సమయాన్ని సోమ్ము చేసి నన్ను సంతోషపరిచావ్
మారిన నిన్నటికి మారే రేపటికి, ముందడుగువై నా వెనుక నిలిచావ్
మీ పాత్ర వర్ణనాతీతం, నా జీవితం ఋణనాతీతం
ఈ తీయని భారం, ఈ బాటసారికి ఎన్నో జన్మల సుకృతం
మీ ఆనందాలు, నా జీవన శృతికి సంకేతాలు
మీ ఆరోగ్యం, నా నాడికి ముడివేసిన భాగ్యం
సంధ్యవేళ పక్షులు గూటికి చేరినట్టు
నేను ఏ దేశం ఎగిరిన, నా ప్రయాణం, నా లక్ష్యం నీ దరిచేరుటకై