నా...నీ సమయం
నా...నీ సమయం


సమయమా... ఎమని చెప్పను నీగురించి
సులభంగా దోరికే సంతోషమా,
సంకోచిస్తూ గడిపిన కాలమా,
అర్ధాన్ని మార్చే అనుభవమా,
ఆశ్చర్యాలను పరిచయం చేసే ఆనందమా,
దాగుడుమూతలతో నేర్పించిన పాఠమా...
ఎమని చెప్పను నీగురించి
నవ్వులను కనీరుగా మార్చే చిత్రమా,
కనీరుని ఆనందబాష్పలుగా మిగిల్చిన మంత్రమా.
జాగ్రత్తయినా జీవితానికి జయమా,
నిర్లక్ష నాదుడికి గుణపాఠమా.
నీతోనే జీవితం నీతోనే మరణం,
మద్యలో నువ్వు ఆడిన ఆటలో నేను ఒక చిన్నా పాత్రదారి.
పోరాటాలు చేయించయన పాఠాలు నేర్పే నీ మహోన్నత గొప్పతనానికి నా ధన్యవాదములు.............