నా ప్రయాణం నీ పయనం....ప్రేమ
నా ప్రయాణం నీ పయనం....ప్రేమ


నీ గురించి చెప్పే పెద్దవాడిని కాదు
నీ గురించి తెలియని చిన్నవాడిని కాదు
నా పుట్టుకతో నా కన్నతల్లి కనీరుతో పరిచయం అయ్యవ్
నాన్న నేర్పిస్తునప్పుడు నేస్తం అయ్యవ్
అక్కతో ఆడినా ఆటలలో అలరించావ్
స్నేహితుల సంతోషాలతో సొంతం అయ్యవ్
ప్రేమించిన అమ్మాయితో మళ్ళీ పరిచయం అయ్యవ్
నీ ప్రతిరూపాలతో నా ప్రపంచం పలికించావ్
నడిచినా కాలంలో గడిచిన గుర్తులతో గల్లంతు చేశావ్
చెయ్యలేని పనులకు చేయూతనిచ్చావ్
కనీరు క్షణాలలో కదిలించావ్
గెలిచిన గడియలలో గోల చేశావ్
అర్ధని పరమర్దని మార్చి మాయ చేసి మైమరపించావ్
మొత్తనికి నాతో నేను నడిచే ప్రతి నిమిషం నాకు నచ్చేలా చేశావ్.
..........LINGA