STORYMIRROR

Aditya Lingam

Abstract Romance Fantasy

4  

Aditya Lingam

Abstract Romance Fantasy

ఇక సెలవు

ఇక సెలవు

1 min
1.0K

నీ కనులను చూస్తూనే నిద్రను మరిచా

నీ చిరునవ్వులకే చలనం మరిచా, 

మొహమాటం తోడై సాగేనా వరసా

నీకైయినా తెలుసునా అదేంటో బహుశా


నీతోని నిమిషాలే నెలలకు వలచా

నీ మాటల శ్రుతులనే మనసున తలచా,

అడుగడుగు నీతో నక్షత్రాలై కురిసే 

పద పద మనంటూనే మనసే మురిసే, 

వేళలో ఉన్నా నా వేనంటే నిలిచే 

ఇపుడైన తెలుసునా మరేంటో పోల్చే 


నీ అల్లరి కబురులే కలవర కడలి 

ఊసుల వివరాలే వదలవు మదిని, 

ముగిసిన ముచ్చట్లే మరచవు మజిలీ 

మౌనంగా లేనందే నాలో నీ చెలి, 

కొంచం చేపెయివే దయుంచి మరి


అక్షరానికి అందనిది ఏంటి ఇది అసలా 

అద్భుతం అనిపిస్తుంది చూస్తేనే కొసరా,

ఇదేంటో ప్రేమని తెలిసిన మొదలు 

దూరంగా పంపించే మన ఈ కథలు,

ఆగేనా తరిగేనా నీపై ఆలోచన 

నీకే అంకితం చేస్తున్న నా ఈ రచన


Rate this content
Log in

Similar telugu poem from Abstract