Aditya Lingam

Abstract Tragedy Inspirational

4.2  

Aditya Lingam

Abstract Tragedy Inspirational

చివర కోరిక

చివర కోరిక

1 min
459


అంతిమ మజిలీ కోసం వేచివున్నా ...


మరెంతో సమయం లేదని తెలుస్తుంది

కనులు చివర కన్నీళ్ళు బరువవుతుంది


నా పిల్లలని చివరిసారి చూడాలని చిరు కోరిక చిగురిస్తుంది

వాళ్ళ స్పర్శకు నేను చలనం కోలుపోతున్నానని అర్ధం అవుతుంది


కను ముందర జ్ఞాపకాలెనో కదిలాడుతున్నాయి

కదిలే ఆలోచనలలో మా అమ్మ కౌగిలి చిరునవ్వును కలిగించింది

మా నాన్న నవ్వులు నా చిన్ననాటిని గుర్తుచేసింది

స్నేహితుల సన్నివేశాలు సంతోషాన్ని చూపించింది 

నా భార్య ప్రేమతో నేను ఎంత అదృష్టవంతుడినో తెలియజేసింది 


అనుకోని సంఘటనలు ఎన్నెన్నో మలుపులు తిప్పాయి 

నా అనుభవాలు, అనుబంధాలు గుర్తొచ్చి గాయాన్ని మాయం చేస్తున్నాయి 


పిల్లలకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాను 

ఇచ్చే దానిలో ఉన్న ఆనందం తీసుకున్న దానిలో ఉండదని తెలుసుకున్నాను 

జీవితమన్న పుస్తకంలో చివర పేజీకి చేరుకున్నాను 


ఓ శివయ్య!! ఒకసారి కనులకి, కంఠానికి శక్తిని ఇవ్వవయ్యా 

నా కుటుంబాన్ని చూసి చెప్పాలని ఉంది ఒక చివర మాట ----- జాగ్రత్త ... ఇంక వెళ్తున్నా!!!!


I dedicate this to all beautiful souls who searching for the strength to say the last goodbye and left us without few things unsaid...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్