STORYMIRROR

Aditya Lingam

Abstract Fantasy Inspirational

4  

Aditya Lingam

Abstract Fantasy Inspirational

అంతిమ యాత్ర

అంతిమ యాత్ర

1 min
324


అంతిమ మజిలీ కోసం వేచివున్నా ......

మరెంతో సమయం లేదని తెలుస్తుంది

కనులు చివర కన్నీళ్ళు బరువవుతుంది

నా పిల్లలని చివరిసారి చూడాలని చిరు కోరిక చిగురిస్తుంది

వాళ్ళ స్పర్శకు నేను చలనం కోలుపోతున్నానని అర్ధం అవుతుంది.......

కను ముందర జ్ఞాపకాలెనో కదిలాడుతున్నాయి

కదిలే ఆలోచనలలో, మా అమ్మ కౌగిలి చిరునవ్వును కలిగించింది

మా నాన్న నవ్వులు, నా చిన్ననాటిని గుర్తుచేసింది

స్నేహితుల సన్నివేశాలు, సంతోషాన్ని చూపించింది 

నా భార్య ప్రేమతో, నేను ఎంత అదృష్టవంతుడినో తెలియజేసింది 

నా పిల్లల కేరింతలు, నాలో కొత్త లోకాలను చూపించింది......

అనుకోని సంఘటనలు ఎన్నెన్నో మలుపులు తిప్పాయి 

నా అనుభవాలు, అనుబంధాలు గుర్తొచ్చి గాయాన్ని మాయం చేస్తున్నాయి 

ఒంటరి జననం ఏకాకీ మరణం నడి మధ్య నాధుడి ప్రయాణం 

జీవితమన్న పుస్తకంలో చివర పేజీకి చేరుకున్నాను 

ఓ శివయ్య!! ఒకసారి కనులకి, కంఠానికి శక్తిని ఇవ్వవయ్యా 

నా కుటుంబాన్ని చూసి చెప్పాలని ఉంది ఒక చివర మాట - జాగ్రత్త ... ఇంక వెళ్తున్నా

                             - LINGA


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar telugu poem from Abstract