నిను చూసిన రోజు
నిను చూసిన రోజు


నిను చూసిన రోజు
నేను పుట్టింది నీ కోసమే అనిపించింది
నీ నవ్వుల్లో నా భవిష్యత్తును చూసుకోవాలనిపించింది
నువ్వు వేసే ప్రతి అడుగు నా వైపే వస్తే బాగుంటుంది అనుకున్నాను
నువ్వు నా కళ్ళ ముందు ఉంటే ఇంకేదీ కావాలనిపించదు
ఒక్కసారి నీవైపు చూస్తే చాలని దేవుడికి మ్రొక్కుకునేవాణ్ణి
నిన్నూ నన్నూ కలపమని ప్రార్థించేవాణ్ణి
కళాశాల నుండి వెళ్ళిపోయిన తరువాత నువ్వెప్పుడూ కనిపించలేదు
ఎవరో నా గురించి చెడుగా చెప్పడంతో నన్ను బ్లాక్ చేశావని తెలిసింది
ఇంక నీకెప్పుడూ కష్టం కలిగించకూడదని నే వెళ్ళిపోయాను
నీ కంటికి ఎప్పుడూ కనిపించను