ఎన్నికలప్పుడు
ఎన్నికలప్పుడు


అప్పుడు నీ అడ్రసు
ఫ్రెష్ గా వేసుకున్న డ్రెస్
నీవే అతడి ఉషస్సు
నీ చుట్టే అతడి మనస్సు
నీతోనే అతడి యశస్సు
నిన్ను మిస్సయితే మిన్నువిరిగి
మీద పడుతున్నంత ఆందోళన
ఏరికోరి నీ గుడిసెను చేరుతాడు
నిన్ను ఆలింగనం చేసుకొని
చెమట చుక్కను పంచుకున్నట్లు నటిస్తాడు
నీ జొన్న రొట్టె ముక్కలను నమిలినట్లు చేసి
నీది నీకే తినిపించి
ign-center">పత్రికలో పతాకశీర్శికవుతాడు
తాను వేసిన పధకాలతో
రాజకీయ ప్రతిష్ట పొంది
పదవిపై కొలువు తీరుతాడు
కొత్త కొలువులో నీ ముఖం
నిన్నటి దినపత్రికవుతుంది
నీ రాక వసంతంలో
గ్రీష్మ ఋతువు అవుతుంది
నీకు గ్లాసు మంచినీటి కన్నా
కడివెడు కన్నీటిని ఉచితంగా అందిస్తాడు
ఎన్నికల ముందు ఆత్మీయుడివి ఆపద్భాందవుడి వి అయితే
తర్వాత అతనికి ఒక అపరిచితుడివి .