వందనాలు
వందనాలు
*******
భరత మాతలో మాతృమూర్తిని
నెలవంక లో నెచ్చెలిని చూసుకుంటూ
గుండెల్లో దూసుకెళ్లిన గుళ్ళు తప్ప
ఎదురు వేన్నీయని వీరజవానులకివే వందనాలు
గడ్డ కట్టించే చలిలో సైతం
పట్టువదలని కార్యదీక్షతో
భారతావని ఆత్మగౌరవం అవలీలగా మోస్తూ
అహరహం అంకితమైన శూరజవానులకివే వంద వందనాలు
రేపనేది ఉందొ లేదో తెలియక పోయినా
ఎరోజుకారోజే చివరి రోజు కావచ్చని తెలిసినా
ముందడుగే గాని వెనుకంజ వేయని
భారతజాతి పౌరుష ప్రతీకలకివే మా వేన వేల వందనాలు
మంగళ నాదాలాగక ముందే
కాళ్ళ పారాణి సైతం ఆరక ముందే
కమాండ్ పిలుపందుకుని
కదనరంగానికి కదిలివేల్లిన దీరజవానులకివే శత కోటివందనాలు
వేదభూమిని కర్మ భూమిని కన్నతల్లిగా
భరతజాతిని కుటుంబంగా
దేశరక్షణే ఊపిరిగా
అనంత విశ్వాన్ని అడుగుతో ఆక్రమించిన
ఆదివిష్ణువు అవతారమైన ధైర్య జవానులకివే సహస్ర కోటి వందనాలు
పరస్పర దుర్భాషలతో ప్రజ్వరిల్లె
స్వార్ధ రాజకీయాలు తలదించుకునేలా
త్యాగానిరతితో దిగంతాల కేగిసిన
వీరజవాన్ కీర్తిచంద్రిక కివే శత సహస్ర కోటి వందనాలు
పరాయి దేశం లో ప్రమాద వశాత్తు కాలిడినా
భయపడక చిత్రహింసలెన్నో భరించి
భారతదేశ పౌరుషం చాటి అజేయుడై
మృత్యుంజయుడై వచ్చిన వీరపరాక్రమ వీరునికివే అభినందనాసుమలు
*********************