చేయి చేయి కలుపుదాం (prompt 29)
చేయి చేయి కలుపుదాం (prompt 29)


చేయి చేయి కలుపుదాం, మున్ముందుకు సాగుదాం
అవరోధాలను, అడ్డంకులను అధిగమించి సాగుదాం
సైనికులమై, దేశ రక్షణకై, శత్రువులతో పోరాడుదాం
పోరాట పటిమ చూపి, శత్రుమూకను దునుమాడుదాం.
దేశ శాంతి భద్రతలను, రక్షక భటులమై కాపాడుదాం
దుండుగులను పట్టి, వారి ఆగడాలను అరికట్టి శిక్షించుదాం
వైద్యులమై రోగులకు సేవచేసి, అనారోగ్యం పారద్రోలుదాం
ఎలాంటి మహమ్మారితో నైనా పోరాడి, దానిని తరిమికొడదాం.
దేశ సమగ్రతకై, రాజకీయ నాయకులమై, ఐక్యతను సాదిధ్ధాం
దేశమంతటినీ ఒక మాటపై నిలిపి, భారతీయతను చాటుదాం.