నా భారత దేశం
నా భారత దేశం


దేశానికి లేదు కులము, మతమూ...
ఒక్కటి గా ఉండటమే తన అభిమతమూ...
కుళ్ళు కుంతత్రాలతో,
అగిపోని ద్వేషాలతో,
ఒకరికి ఒకరు భాయి భాయి అని మరచి,
కులమతాల ఉచ్చులో ఒరిగిపోతున్నాము,
దేశం మనది అని మరిచి పోతున్నాము...
ప్రాణం విలువ తెలియని మనము,
మనిషికి విలువ ఇచ్చిన క్షణము,
మువ్వన్నెల జెండా మురిసిపోతుంది,
దేశానికి విలువ పెరిగి పోతుంది...
దేశం అంటే మట్టి కాదు,
దేశం అంటే మనుషు లోయి,
అన్నారో ఒక మహా కవి,
ఆ మనుషుల కోసం,
మన జీవితాల కోసం,
అలుపెరగని ఆరాటం,
విరామం లేని పోరాటం,
చేస్తున్న అసలైన దేశ భక్తులు,
మన దేశ జవానులు...
ఎండనక వానానక,
పరివారం విడి చాక,
ఆకలి దప్పులు మరిచి,
తన జీవితాన్ని విడిచి,
ప్రాణం పణం పెట్టి,
చేతిలో ఆయుధం పట్టి,
దేశం కోసం దేహం సైతం విడిచి,
పోరాడే ఓ జవాను,
దేశం పై ప్రేమే తన జవాబు...
వారికి లేదు కుల మతాల సందిగ్ధం,
ఉన్న ఒక్క జీవితం,
దేశానికి అంకితం,
అటువంటి ప్రేమ,
మనలో ఉంటే,
భారత దేశం ముద్దు బిడ్డగా,
మనం నిలిచి ఉంటే,
కాదా మన దేశం సస్య శామలం,
నిలవద తను అయ్యి మానవత కు నిలయం...