వెళ్ళిపోయా...
వెళ్ళిపోయా...
గుండెల్లో ఆగిపోయిన మాట ఒకటి ఉంది
నీతో ఎన్నో చెప్పాలని ఎదురు చూస్తోంది
నీ రాకకై ఈ కళ్ళు ఇంకా వేచి చూస్తున్నాయి
అగ లేక కొట్టుకునే గుండె చప్పుడు ఇంకా వినిపిస్తూనే ఉంది
ప్రాణం లా ప్రేమించా
నువ్వే నా లోకం అనుకుని జీవించా
ప్రేమ లో ఉనంత సేపు గుర్తు రాలేదా
నాలో ఉన్న లోపాలు
వదిలేసే సమయం లో ఉన్న ఆ వివరాలు
గాయం మానదు లే
బరువు దిగదు లే
మౌనం కూడా భయంకరం గా ఉంది
నా ఊపిరి ఆగిపోయెలా నా శ్వాస నాకే వినిపిస్తోంది
ఎక్కడికి పారిపోను
ఎటు వైపు వెళ్ళిపోను
నీ జ్ఞాపకాలతో ఎలా నే మిగిలి పోను
నువ్వు లేని రోజే వొద్దనుకున్న
నీవు లేని నే
ను ఎలా ఉండాలి
ప్రాణం లో జీవమే పోవాలి...
కాను ఎవరికి ఏమి
కాదు అనను
నీతో ఉన్న ప్రేమని
ఎవరు ఏం అన్న
కాలం ఎటు వీడిన
పయనం ఎటు వైపైనా
ప్రయాణం ఎక్కడికైనా
నా లో ఊపిరి ఉనంత వరకు
నా గుండె కొట్టుకోవటం ఆపేంత వరకు
ఎక్కడా ఉన్న ఏమి చేస్తున్న
నువ్వే నాలో ఊపిరివి
శిలగా మారినా నాలో ప్రాణనివి
దిశ మారింది కానీ
నా దశ కాదు
మనసు చంపేసానూ కానీ
దానిలో నీ పై ఉన్న ప్రేమను కాదు...
వొద్దు అని నువ్వేలిపోయావు
కావాలని నేనుండిపోయాను
రావాలో వొద్దో నీకే వదిలేశా
నీ లో నన్నే వదిలి నేను వెళ్ళిపోయా...