నాన్న...
నాన్న...
అమ్మ చూపించే మరో ప్రపంచం,
జీవితం లో నిలిచిపోయే బంధం,
వేలు పట్టి దారి చూపిస్తావు,
వెన్నంటి ఉండి దైర్యం చెప్తావు,
బాధ పెట్టినా,
బాధ్యత మరచి పోవు,
భారంగా ఉన్నా,
చిరునవ్వు తో అన్ని చేస్తావు,
నీ ఆశలు వదిలేసి,
నా ఆశలకి ప్రాణం పోశావు,
బాధ్యతలతో తల మునకలు అవతున్నా,
ప్రతి నిమిషం మా కోసం పోరాడుతూ నే ఉన్నావు,
ఓడిపోయినా నేనుంటా అంటూ,
నాకు దైర్యం గా నిలిచావు,
నా గెలుపు లో నీ ఆనందం,
నా మొదటి నేస్తం,
ఎన్ని తప్పులు చేసినా మన్నిస్తావు,
అమ్మ దగ్గర ఓర్పు నేర్చుకుంటే,
నాన్న దగ్గర ఓదార్పు నేర్చుకున్నా,
ఎన్ని ఆటంకాలు వచ్చినా,
ఎన్ని సార్లు పడినా,
లేచి నడవడం నేర్చుకున్నా,
వెన్నంటి నేనున్నా దిగులు వద్దు,
అనే నీ మాట,
వేలు పట్టి నడిపించిన ఆ బాట,
ఎడుస్తే గుండె కి హత్తుకున్నవూ,
కన్నీరు తుడిచి ముందుకు నడిపించావు,
నా దైర్యం నువ్వు,
బాధల్లో చిరునవ్వు నువ్వు,
కనబడని నీడలా నా వెనక ఉన్నావు,
ఆ గోరు ముద్దలు మరచిపోను,
ఆ మంచి, చెడులు మరవను,
నువు పరిచయం చేసిన ప్రపంచం,
నువు పక్కన లేకపోతే అంతా శూన్యం,
నాన్న...
యూ ఆర్ మై హీరో