అందాల బొమ్మ
అందాల బొమ్మ
అద్దాల మేడలో పెరిగిన ఒక బొమ్మ
నాన్నకు ముద్దుల కూతురమ్మా
అమ్మ కొంగున పెరిగిన చిన్నారి కున్నామ్మా
అల్లారూ ముద్దుగా పెంచారు
కాలు కందకుండా
మట్టి అంటకుండా
చిన్నారి చిట్టి తల్లీ
అందాల రాశే అనాలి
వెతికి వెతికి తెచ్చారు ఆ ముద్దుల పట్టికి వరుడిని
నీకోసమే అన్నట్టూ గా ఉండే భాగస్వామిని
జాగ్రత్త చెబుతూ కనీటి తో చెప్పారు ఆ తల్లికి వీడ్కోలు
ఈరోజు నుంచి నీదే భాద్యత
మా అమ్మాయి జాగ్రత్తా అని అల్లుడికి చెప్పారు
ఆ తల్లిదండ్రులు
ఎక్కడ పెరిగిందో
ఎప్పుడు నీ చెయ్యి పట్టిందో
ఎడడుగులు నడిచి
నమ్మి నీ వెంట వచ్చింది
తనకి తెలుసు తన ప్రపంచం మారింది అని
భర్త లో తన రూపు చూడాలని
కాలికి పరాని ఆరలేదు
కొత్తగా తెచ్చిన వస్తువులు వాడలేదు
చలికి వనికిన పువ్వులా
ఉరుముకు దడుచుకున్న పాపాల
ఉక్కిరి బిక్కిరి అయ్యి
బిత్తర మొహం వేసుకుని కూర్చుంది పిచ్చి తల్లి
చేసుకున్నా వాడు చూసుకుంటాడని
తనతో జీవితం పెంచుకుంటాడు అని
మృగుమో ఏమో కానీ మగవాడు కాదు
మనిషిలా అసలు లేడు వాడు
వాడంత యోగ్యుడు లేడని నమ్మించాడు
బొమ్మాల పెరిగిన తనని
శవం లా మార్చాడు
వాడి పైశాచికత్వాన్ని కి ఒక ఆడపడుచిని బలిచేసాడు
తప్పేంటి తనది
ఎవర్ని అడగలేక
ఇంటికి తిరిగి వెళ్ళ లేక
బరిచింది ఒకరోజు ప్రాణమే విడిచింది
కష్టం వస్తే మెమ్మున్నాం అనే బరోసా తన వాళ్ళు ఇ వలేదు
ఏమైనా మేముంటం అని బాస చేయలేదు
పరువికి ఇచ్చిన విలువ ప్రాణం కి లేదు
ఏమి చేయాలో తెలియక
తనవారికీ భారాం కాలేకా
తనువు చాలించింది ఆ అద్దాల మేడలో
పెరిగిన బంగారు బొమ్మా...