యాచించు బాలురం ...
యాచించు బాలురం ...


కరం నరం సహకరించు ప్రతీస్వరం
జ్వరం గరం గణించక యాచించు బాలురం
మాదేముందని నేరం , దేవుని కెందుకు మాతో ఇంతటి వైరం
కానరాదే అమ్మ చూపే మమకారం
కానరాదే నాన్న చేసే గారం
కానరదే మేము చేసే ముద్దుల మారాం
కరం నరం సహకరించు ప్రతీస్వరం
జ్వరం గరం గణించక యాచించు బాలురం
మా సారంతో భేరం చేయుటెంత ఘోరం
నిద్దుర లేని జాగారం , హద్దులు లేని భారం
మాసిన క్షవరం
చొక్కా లేని బక్క శరీరం
మీ దయ పొందుట మాకో వరం
గుడిలోని పట్టెడు ఫలహారం
దీనాం మా కడుపున చేరు ఆహారం
కరం నరం సహకరించు ప్రతీస్వరం
జ్వరం గరం గణించక యాచించు బాలురం
***
కన్నీరు మా నేస్తం , మమ్మల్నిడవనంటుంది
నవ్వు మా శత్రువు , మమ్మల్ని చేరనంటుంది
***
చిట్టి చేతులు మీ ముందు చాచెను
గట్టి దెబ్బలతో మా ఒళ్ళు వాచెను
వట్టి రూపాయి కోసం మా కళ్లు వేచెను
అయినా మీ మనస్సు చలించకుండెను
***
ఒకడు కాలు లేక , ఒకడు కన్ను లేక .. మీ ముందు
కన్నూ మిన్నూ కానరాక .. మీరు వారి ముందు
ఒకడు చేయి లేక , ఒకడు వాయి లేక .. మీ ముందు
చేయి చేసుకుంటూ , వాయి పారేసుకుంటూ .. మీరు వారి ముందు
ఒకడు అయ్యప్ప గా , ఒకడు భవానీ గా ..
ఒకడు చేవ లేక , ఒకడు చావ లేక .. మీ ముందు
ఏ సాయం చేయలేక మీరు వారి ముందు
కలిగుండవచ్చు ఈ అనుభవం ప్రతి ఒక్కరికీ
అయినా అయినా ... ఏది ఏమైనా ...
తమ కన్ను తడి చేయరు ..
మా కష్టం తుడి చేయరు ... ఎవ్వరూ .. ఏ ఒక్కరూ ..
***
బెగ్గర్ మాఫియా ఏమన్నా కాఫీయా ..
ఆస్వాదించడానికీ, అరికట్టకపోవడానికీ ..