నా చెలి తార ...
నా చెలి తార ...


ఆ చిరుజల్లులో చిన్న చినుకుగా...
ఆ నింగిలో ఓ తారగా ... తళుక్కుమన్నావులే నయగారమా.. నా సొగసుల సరాగమా....
ఆ కొమ్మ పైన రామచిలుకగా..
పూరెమ్మ మీది నీటి బిందుగా... వున్నావులే అల్లిబిల్లిగా .. నా పాలి రంగవల్లిగా..
నా మనస్సులో మెదిలిన నా మదిమనోహరి నీవేగా...
మొదటిసారి నే మెచ్చిన మగువవి నీవేగా...
తెలియదు నాకు వేరే ఏ పేరు..
అయినా నా తోటి నీ తీరే వేరు...
నవ్యమా.. కవి వ్రాసిన కమ్మని కావ్యమా...
చూపుమా.. కాస్తైనా నాపై కరుణ సుమా....
వినవే నా మాట ఒక పరియైనా..
విసుగైనా రాదే నీ పైనా....
విడువవా నీ మౌనం ఏ మాత్రమైనా...
విప్పవా నీ పెదవి దాచిన ప్రేమ సామ్రాజ్యం ఇకపైనా....
చెలీ.. నువ్వు లేని క్షణాలు...
గడిచాయి నాకు కొన్ని మరణాలు....
నూ యవ్వనవతివో... యతి తపస్సు చెరిచిన యువతివో...
కావా నా సతిలా.... సిరి సిరి చందనాల లాహిరిలా.......!!!!!!
చక్కనైన చెక్కెర కేళివే,
చందమామ సైతం మెచ్చే, చూడ చక్కని చుక్కవే,
మది మెచ్చే నీ ముద్దే అది మచ్చుకైన ఒకటివ్వే ...
నను మిరుమిట్లుగొల్పగ వచ్చిన మిణుగురువే నీవు...
నను మురిపించి ఆపై మైమరపించిన మృదు మథుర మార్దవపు మాదకమే నీవు..
నీపై మగ్గు చూపగ ఓ మగువా, అయ్యాను నేను ఓ గువ్వ....
ఓ కలువ పువ్వులా కన్నులదానా,నాపై నీ కాఠిన్య కర్కటపు కసరత్తులేల....
నను కసిగా చూసిన అసివే నీవు, పసి పసి చూపుల ఊర్వసివే నీవు......!!!!!!