కలల సారిక ...
కలల సారిక ...


కలల అలలు చెలరేగెను నాలో,
కదలాడుతున్న కథలు ఎన్నో...
కదనాల దాక దారి తీయు తీరుతెన్నులలో,
కటిక చీకట్ల మాటున కన్నీరు కథనాలు ఎన్నో...
చిరునామా తెలియని చిరుప్రాయం,
గుర్తులేని గుండె చప్పుళ్ళ మౌనం,
, 56);">తీరని ఓ గాయం...
చేయవా కూసంత సాయం...
కనిపించి ఓ సారి , అదే న్యాయం....
ఊహల్లో ఒద్దికగా ఒదిగిన స్వప్నిక,
స్పృహకు రాని మథుర భావన,
సౌహార్దపు సౌధాన్ని నిలయంగా గాంచిన సారిక,
ఎదకు పాకిన ముత్యపు అల్లిక నవ మల్లిక...!!!!