ఈ లాక్‌డౌన్
ఈ లాక్‌డౌన్
ఈ లాక్‌డౌన్
ఎన్నో నేర్పింది
డబ్బు కంటే ఆరోగ్యం గొప్పదని
మనిషి ప్రకృతిని నాశనం చేయకూడదని
షేక్ హ్యాండ్ కంటే నమస్కారం మేలని
వ్యక్తిగత శుభ్రతలో శానిటైజర్ తప్పనిసరి అని
ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేసే వ్యక్తులను
మనం గౌరవించాలని
మనుషులు ఎన్నో ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని
ప్రకృతితో మమేకమై జీవించాలని
ఈ లాక్‌డౌన్
ఎన్నో నేర్పింది
మరెన్నో నేర్చుకోమంటోంది.