ఆకలి - త్రేన్పులు
ఆకలి - త్రేన్పులు
పేగులు అరిచే ఆకలి కేకలు ఒకరివి
బాగా తిని వచ్చే త్రేన్పులు ఒకరివి
ఖాళీ కడుపు గ్యాసు ఒకరిది
ఎండిన డొక్కల బాధ ఒకరిది
వండినది ఎలా పడేయాలా అనే ఆలోచన ఒకరిది
వండే వీలు లేక ఎవరైనా పడేస్తే తిందామనే ఆత్రుత ఒకరిది
అన్నీ ఉన్నా తినలేని స్థితి ఒకరిది
తినాలని ఉన్నా ఏమీ లేని పరిస్థితి ఒకరిది