ఎన్ని జన్మలు..ఇంకెన్ని జన్మలు.. జీవా!!
ఎన్ని జన్మలు..ఇంకెన్ని జన్మలు.. జీవా!!
నీలో నిన్ను వెతకలేక పోయితివా?
నీలో నిన్ను కలుసుకొన్నలేక పోయితివా?
దుర్లభము.. నీ ఈ జన్మ దుర్లభమే.. జీవా!!
వీడ వలసిన మాయ లోకపు సుందర సొగసులతో..
మతిభ్రమించి తిరుగుతున్నావా? అయ్యో ..జీవా!!
జన్మ మరణ చక్రములో మరల పడి పోవుటకు..
విషయ వాంఛల కై ..పరితపించి పోతున్నావా?
ఎన్ని జన్మలు..ఇంకెన్ని జన్మలు.. జీవా!!
దుర్వాసనలతో కూడిన చోట...
అశాంతితో చంచల స్థితిని కలిగిన చోట..
అతి స్వల్ప సుఖాన్ని కై బానిస అయిన చోట..
సత్యాన్ని అతికష్టం తో గ్రహించే చోట...
వెతుకు నీలో నీవై.. నీ ఆత్మ సాక్షి ని అడిగి చూడు..
చెప్పకతప్పదు లే.. నిన్ను గట్టిగా హెచ్చరించక తప్పదులే ...
మనసున పరమాత్మను నింపి...
విచక్షణా జ్ఞానంతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించ క...
పారమార్థిక సాధనల
ు చెయ్యక...
ఎన్ని జన్మలు..ఇంకెన్ని జన్మలు.. జీవా!!
జన్మ మరణముల నుండి శాశ్వత సుఖాన్ని కై నడిపించే త్రోవ ...
నీలో నిన్ను వెతుక్కో గా ..
నీలో నువ్వైనా పరమాత్ముని.. కలుసుకో గా...
ఎన్ని జన్మలు..ఇంకెన్ని జన్మలు.. జీవా!!
ఎన్ని జన్మలు..ఇంకెన్ని జన్మలు.. జీవా!!