చేరవే దరి చేరవే... నా చెలివై నన్నేలవే
చేరవే దరి చేరవే... నా చెలివై నన్నేలవే
చేరవే దరి చేరవే కలవర పెడుతున్న ఆనందమా ...
ఒక్కసారి ఇటు చూడవే నా చెలివై నన్నేలవే...

కనులకింపైన ఆకారమా... వయ్యారాల సెలయేరమా ...
కలల కొలనులో కమ్ముకున్న నిషా పుష్పమా...
పరిశోధించి చూసా ఇది అద్భుతాల కళాఖండమా?
అన్వేషణలకు కళానిలయమా?
చేరవే దరి చేరవే కలవర పెడుతున్న ఆనందమా ...
ఒక్కసారి ఇటు చూడవే నా చెలివై నన్నేలవే...
ఏమిచ్చి తీర్చను నిన్ను పంపిన ఆ బ్రహ్మ కి ?
ఏమేటి చూపను..., ఏమేటి చెప్పను ...
నా ఆనందాలకు హద్దులు ఇవి అని?
చెలియా....
కోటి వర్ణాల పూలతో పూజించనా ...
కోరిన కలను నెరవేర్చేలా నిన్ను చేరనా...
చేరవే దరి చేరవే కలవర పెడుతున్న ఆనందమా ...
ఒక్కసారి ఇటు చూడవే నా చెలివై నన్నేలవే...
ఓ ....అందమైన మోము దాన...
ఓ ....అరుదైన మనసున్న దాన...
నీ ధ్యాసేఅయనే...
నీవుసే వినపడసాగెనే...
చేకోరా పక్షి ల నీకై నీ ముందు నిలిచా...
ఎన్నో వరముల పుణ్యఫలమువై నన్ను చేరవే...
చేరవే దరి చేరవే కలవర పెడుతున్న ఆనందమా ...
ఒక్కసారి ఇటు చూడవే నా చెలివై నన్నేలవే...
చేరవే దరి చేరవే .... నన్ను చేరవే....నా చెలివై నన్నేలవే.........