అలిగావా ఓ చిన్నదాన... అలజడులే నా గుండెలోన...
అలిగావా ఓ చిన్నదాన... అలజడులే నా గుండెలోన...
!!పల్లవి!!
అలిగావా ఓ చిన్నదాన.. అలజడులే నా గుండెలోన
!!2!!
ఉహుహూ...హూ....
ల లా...లా... హే ఇటు చూడు...
నా కళ్ళల్లో నీపై ప్రేమా ..కనిపెట్టలేక కాటిన్యమా
పొరపాటేలే మన్నించి పో.. ఇలా దరిచేరి ముద్దిచ్చిపో
అలిగావా ఓ చిన్నదాన.. అలజడులే నా గుండెలోన !!2!!
!!Music!!
!!చరణం!!
తప్పక వెళ్లానే పెళ్లిచుపులకి.. తప్పించుకొని వచ్చానే
కన్నవారి కోసమే వెళ్లానే..కనికరించవే నె నీవాడినే
పొరపాటయింది ఇక నే వెళ్ళనే..మన్నించి ఇటు చూడవే
నేనిస్తున్నానే మాట.. నీవేలే నా జంట
నా పొట్టి పిల్ల అహ నా బంగారు పిల్ల..
కోపమేలనే... ఆ అలక వీడవే...
నా ప్రాణమా కరుణించి.. ముత్యాల వంటి మాటలతో
వెన్నెల లాంటి నవ్వులు ప్రసాదించుమా
అలిగావా ఓ చిన్నదాన.. అలజడులే నా గుండెలోన !!2!!
!!Music!!
!!చరణం2!!
చెదిరిన ఆ కళ్ళలో ..దాగున్నదే నాపై ప్రేమ
చెరలో నన్నుంచకే..చెలిమికై నన్నూడికించకే
నీతోనే ఉంటానే.. నిన్ను విడిచి నె పోనే
ఆ రామలోరికి సీతమ్మ.. ఈ రాజు గాడికి ఈ చిత్రమ్మ
అలిగావా ఓ చిన్నదాన..అలజడులే నా గుండెలోన !!2!!
!!Music!!
!!చరణం3!!
!!Female!!
తట్టుకోలేను నేను ఒప్పుకోలేను..
మాట వరసకైనా నే నిన్ను విడవలేను..
నీ ఉహలో తిరిగే పిచ్చిదానిని..
నీవే నా లోకం అనుకుంటిని..
పరిహాసాలు వద్దు.. పెళ్లి చేసుకోవాలి ముందు.....
నాతో ..
పరిహాసాలు వద్దు.. పెళ్లి చేసుకోవాలి ముందు.....
!!Music!!
!!Male!!
ఇటు చూడవే నా మాట వినవే..
మన పెద్దలకి చెప్పి ఒప్పించానే
ఇక పెళ్లి పీటలు ఎక్కుదామే
ఆలుమగలం అయిపోదామే
ఆహా నా పొట్టి పిల్ల నా బంగారు పిల్ల
నా ఏలు పట్టుకోవే.. ఏడు అడుగులెయ్యావే
రాజ్యాలని ఏలుదామే.. కలలెన్నో కందామే
ఆలుమగల ఆటలో.. గిన్నిస్ బుక్ కెక్కు దామే...
అలిగావా ఓ చిన్నదాన.. అలజడులే నా గుండెలోన ..
రాయే పిల్ల ఇక పోదామే పిల్ల.. పెళ్లి సందడి చేద్దామే పిల్ల.......
ప్రియురాలు:
తన ప్రియుడు తనకు తెలియకుండా పెళ్లి చూపులకు వెళ్లి వచ్చాడని తెలుసుకున్న ప్రియురాలు
ప్రియుడు:
ప్రియురాలి కోసం ఆ సంబంధాన్ని తప్పించి పెద్దలను ఒప్పించి తన ప్రియురాలని బుజ్జగిస్తున్న సందర్భం...

