ఒకరి బాధే మరొకరికి ఆనందమా..
ఒకరి బాధే మరొకరికి ఆనందమా..
నీ జుట్టులోకి పోనిచ్చిన మునివేళ్ళు
నా షర్ట్ మీద నీ చెమట వాసన
రింగులు తిరిగిన జుట్టు
నా చాతీ మీద నుండి జారుతూ
నన్ను గిలిగింతలు పెట్టిన ఫీలింగ్
నా కాలి మడమల దగ్గర
నీ కాలి వేళ్ళ తాకిడి
శరీరాల రాపిడా
ఫ్
కానే కాదు
నిన్ను చూస్తూ కరిగిపోవాలని
నీలో నిలిచిపోవాలని
నా తనువు చేసే యజ్ఞం అది
విరహం బాధకు
ఆలింగనాల సంగ్రామాలే విరుగుడు
నన్నిలా కోరికల నిప్పుల్లోకి తోసి
నువ్వు ఆనందంగా ఉండగలవా
ఉన్నా ఉంటావులే
సర్లే
గుర్తొస్తే ఫోన్ చెయ్యి
నా ప్రేమను గుర్తిస్తే..

