*దాశరథి కృష్ణమాచార్య*
*దాశరథి కృష్ణమాచార్య*
తెలంగాణకోసం ఉదయించిన సూర్యుడు,
పద్యాలే ఆయుధంగా మార్చాడు,
తెలంగాణ ప్రజల కన్నీళ్లను,
అగ్నిధార గా మలిచాడు
నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించి,
బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి,
ప్రజలలో చైతన్యాన్ని రగిలించాడు,
చిన్నతనంలోనే పద్య ప్రావీణ్యం కలవాడు,
ఉస్మానియా లో బియ్యే చదివాడు,
అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు,
సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, భాషల్లో మంచి పండితుడు,
మంచి ఉపన్యాసకుడు,
ఎన్నో సినిమా పాటలు,
కవితలు రాసి,
అభిమానాన్ని సంపాదించుకున్నాడు,
తెలంగాణ కోసం ఆయన రచించిన పద్యాలు,
ఇప్పటికీ అందరి నాలిక మీద ఉత్తేజాన్ని కలిగిస్తాయి,
దాశరథి గా సుప్రసిద్ధుడు,
కవి సింహం బిరుదాంకితుడు,
యువతకు ఆయన స్ఫూర్తి,
ఆంధ్ర కవిత సారథి,
ఆయనే మన దాశరధి.