ఆశ
ఆశ
ఆశల పురుగులు మెదడును
తినేస్తున్నాయి,
ఆచంచలంగా కూర్చున్న నన్ను
చంచలమైనా మనసు సూదులు
గుచ్చేస్తున్నాయి,
నాకెందుకులే నలుగురితో పోటీ
అని ఆగిపోతే
నక్కలై అరుస్తున్నారు నన్ను చూసి,
ఎప్పుడు ఎప్పుడు పీక్కుతిందామని
స్వార్ధమనే మాంసపు ముద్దలకు అలవాటు పడ్డ
మనసుల రూపంలో వున్న మృగల మధ్యలో
దిక్కు తోచని లేడిపిల్లలా దీనంగా చూస్తున్న,
ఎటు అడుగులు వెయ్యాలో తెలియని
అయోమయంలో ఆదరణకై ఏదురు చూస్తున్న
ఆధారిస్తాడనే అరుణాచలేశ్వని నమ్ముకున్న
అహంలేదు సుఖం మీద ఆశ లేదు
జనం చూపుల మీద ద్యాస లేదు
నన్ను నేను తెలుసుకోకుండా
జీవితం ఆగిపోతుందేమో అనే
అనే భయం తప్ప.