STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఎవరికి తెలుసు

ఎవరికి తెలుసు

1 min
3


బావా తప్త మది ఏమంటే ఎవరికి తెలుసు
అవధి లేని మనసు ప్రేమంటే ఎవరికి తెలుసు

అలలతో తడిసే దరికి
తెలుసా హాయేంటో
మరిగే కనునీటీ తేమంటే ఎవరికి తెలుసు

మొగ్గ విచ్చునో విచ్చక
రాలునో తెలుసునా
అయోమయమునిచ్చు రేపంటే ఎవరికి తెలుసు

వర్ణాల వలువలను
సింగారించుటమే కాని
తలపులకు లొంగని
తేటంటే ఎవరికి తెలుసు

మనసుకాహ్లాద పాటేదో బాటేదో
ఆశాబంధమే మేనంటే ఎవరికి తెలుసు

నిత్య చైతన్య నిశ్శబ్ద నిప్పుకె జీవితం
 వ్యధలు కలిచే ఎద చేనంటే ఎవరికి తెలుసు కదలు
కలాపమై మెరుస్తు
చెలిమి దోయిలైన నేనంటే ఎవరికి తెలుసు



Rate this content
Log in

Similar telugu poem from Classics