ఓం ప్రాణం
ఓం ప్రాణం
దృఢమైన శరీరాకృతి నీ ఇచ్చాడు.
అనర్గళంగా మాట్లాడగలవు.
చెబితే అర్థం చేసుకుంటావు.
నీ ఙ్ఞానం నీ సొంతం.
ఏది మంచో ఏది చెడో తెలుసు.
అబద్ధమేదో నిజమేదో తెలుసుకోగలవు.
అనుకుంటే ఏదైనా సాధించగలవు.
నీ మీద నీకు నమ్మకం ఎక్కువ..
సంపాదించగలవు.
ఖర్చు చేయగలవు.
కష్టం విలువ తెలుసు
కన్నీటి బొట్టు లో బరువు చూసావు.
ఓటమి చూసావు.
గెలుపు ఆస్వాదిస్తావు గొప్పగా.
అదృష్టం కలిసి వస్తుంది అప్పుడప్పుడు.
ఎన్నో కఠినమైన రోజులు గడిపావు..
అన్ని తెలిసి ఏదో తప్పటడుగు
వేసి బాధను భరిస్తూ
కన్నీళ్ళ ను దాచుకొని పైకి నవ్వుతు నటిస్తావు
అందగా నీకు నువ్వే సాటి ఓ మనిషి...
