ఆగిపోలేదు
ఆగిపోలేదు
అలసిపోయిన ఆగిపోవాలని లేదు.
ఎన్ని కత్తుల వంతెనలు ఎదురైన.
ఎన్ని ముళ్ళ బాటలు ఎదురువచ్చిన.
ఆశ్ర శాస్రాలు ప్రయోగించిన అదిరేది లేదు..
ఎన్ని ఆటంకాలు ఎదురువచ్చిన.
ఎందరు అడ్డుకున్నా.
ఎన్ని సమస్యలు చుట్టుముట్టిన.
అడుగులు ముందుకే.
అడ్డుకుంటే నీటిల ప్రవహిస్తాను.
మట్టిల జరిపోతాను.
అగ్ని శికలుగా ఎగసిపడతాను.
మంచు ల కరిగిపోతాను.
పాదరసమై చెల్ల చెదురుగా పడిపోతాను.
ఆకాశంలో తారలుగా ప్రకాశిస్తాను.
రంగుల హరివిల్లుగా మారిపోతాను.
చిమ్మ చీకటి లో వెలుగు జిలుగులు పంచుతాను.
పసిపాప నవ్వులుగా మురిసిపోతాను
కళకలమై వర్ధిల్లుతాను ఆగిపోకుండా...
