STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఊహలో చుక్కలు

ఊహలో చుక్కలు

1 min
0


ఊహల చుక్కల..పందిరి తోడుగా..!
బ్రతుకే ఆశల..వెన్నెల మడుగుగా..!

ప్రేయసి మనసే..పార్వతి దేవిరో..
ప్రాణమె సఖుడూ..శివుడోయ్ నిజముగా..!

ఎఱుకల వాడయె..విడిగా లేదురో..
హృదియే ఈశ్వర..నివాస క్షేత్రముగా..!

ఆకర్షణయే..దారము చూడరో..
తెగనిది తగనిది..విడువగ తగునుగా..!

సొగసరి టక్కరి..కనులను మూయరో..
బుద్ధికి గమనిక..చేరిన మేలుగా..!

రుచులకు బానిస..నాలుక కాదురో..
తన్నగ మరచిన..తియ్యని తంతుగా..!


Rate this content
Log in

Similar telugu poem from Classics