STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కలలుకంటు

కలలుకంటు

1 min
1



కలలుకంటు కూర్చుంటే..చాలదులే లెమ్మంటా..!
సాకారం చేసుకోగ..ఉపాయమే చూడంటా..!

సొంతమైన ఆశయాల..ఒక పక్షిగ మనసేనోయ్..
ఆకాశపు అంచులనే..దాటువిద్య పట్టంటా..!

స్నేహానికి చేయిజాచు..తత్వమదే ప్రాణమోయి..
పోషించే నిధి నీవే..పదుగురికీ పంచంటా..!

దివ్యప్రేమ కోవెలయే..నీ హృదయం గమనిస్తే..
నేనంటూ ఎగిరిపడే..పడగ సాక్షి ఆగంటా..!

యతిరాజుల పాలనయే..అవసరమిక విశ్వానికి..
పశుపక్షుల సంరక్షణ..యజ్ఞంలో ఉండంటా..!

రాజకీయ ప్రక్షాళన..చేయగలుగు విజ్ఞులెవరు..
ఓటు-నోటు తతంగమిక..మట్టుబెట్ట కదులంటా..


Rate this content
Log in

Similar telugu poem from Classics