STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

విజయానికి

విజయానికి

1 min
1


 
ఎవరితోటి పోటీయే..లేదంటా విజయానికి..!
పవిత్రమౌ మంకుతనం..చాలంటా విజయానికి..!

ప్రతి విషయం ఓ ఆటయె..నీ ఎంపిక నీదే మరి..
ఒక చక్కని అవగాహన..బలమంటా విజయానికి..!

వెనుకముందు లాడకుండు..వివేకమే నేస్తమందు..
ఒక సడలని బిగువన్నది..తోడంటా విజయానికి..!

ఎదురుదెబ్బ లేవైనా..తిరుగులేని పాఠాలే..
ఓటమియే నిఖార్సైన..గురువంటా విజయానికి..!

స్వాతిశయం గాకుండా..అసలు శత్రువెవ్వరోయి..
మతికెక్కిన నీ గొప్పలె..అడ్డంటా విజయానికి..!

సదావేశ సమావేశ..ఆలయమే నీ హృదయం..
మనసు పుటంపెట్టు విద్య..నేర్వంటా విజయానికి..!



Rate this content
Log in

Similar telugu poem from Classics