ఓ పిల్లా
ఓ పిల్లా
ఓ పిల్లా... నా పిలుపులు నీ గుండెకి చేరలేదా?
ఈ జాబిలి బాటలో పరిచిన జాజులు మల్లెలు నీకేం చెప్పలేదా?
అలసిన నా హృదయం ఒక్క నీ చెలిమినే అడిగిందే...
ఏం చెప్పినా సరే నీవు లేవని అంటే మాత్రం అది వినకుందే.
ఈ వెన్నెల తోటలో నిలిచిన చెట్టులు పక్షులు నీకేం చెప్పలేదా?
వెన్నెల వర్షం నన్ను నీతో కలిసి నీ చెంతకు రమ్మందే...
నువ్వు లేక నేను మాత్రమే వస్తానంటే.. నన్ను ఉరుములలోకి తోసేసిందే...
నే తట్టుకోలేనమ్మా.. నను నెట్టేస్తున్న ఈ దూరాన్నే...
నువ్వే వచ్చి ఆర్పేయమ్మా.. నను కాల్చేస్తున్న ఈ గాయాన్ని...
ఓ జాబిలమ్మ.. నా ప్రాణాన్ని కోసుకు తీసుకుపోతున్నావే...
నీ దారి నిండా నా ఊపిరి పరిచేసి నీ పిలుపుకై వేచున్నానే..

