నువ్వే
నువ్వే
నాకు రెక్కలు లేవు.
ఆకాశంలో ఎగరలేను.
మంత్ర శక్తులు లేవు.
అన్ని జరిగిపోవడానికి.
కోరింది దొరకదు.
అనుకున్నాది జరగదు.
ఏది వచ్చిన తట్టుకోవడమే తెలుసు.
సంతోషాలు పలకరించిన.
బాధ అనుభవించిన.
అన్ని మనమే అనేది నిజం.
ఎవరురారు ఏదో జరిగిపోవడానికి.
గాయాల నొప్పులు అనుభవించాలి.
గండాలు మనమే దాటాలి.
నీజీవితామనే రాజ్యానికి
రాజువై కాపాడుకోవాలి
మంత్రిలా ఆలోచించాలి.
సైనికుడివై సమస్యను ఎదుర్కోవాలి.
గెలిచేనా ఓడినా
అన్నినువ్వే అన్నింటికి నువ్వే అన్నింటిలో నువ్వే..
