STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఎదురుచూపులు

ఎదురుచూపులు

1 min
1



ఎదురుచూపులు పెనిమిటి కోసమో, ప్రేమికుని కోసమో
కళ్లల్లో కాంతులతో ఆమె వెతుకులాట
నిరాశ, నిస్పృహలతో పెనుగులాట
ఆశ చిగురించినప్పుడల్లా ఆరాటం, ఆతృత
మనసు నిర్మలం చేసుకొని మరో మారు ప్రయత్నం
ఫలించే ఘడియ కోసం తపన 

ఎదురుచూపుల్లో తీయని జ్ఞాపకాలుంటాయి
పరవశింపజేసే కలలుంటాయి
మధురమైన ఊహల కలబోతలుంటాయి
కన్నీటిని తుడుచుకొనే ధైర్యాలుంటాయి
బాధల్ని తట్టుకునే బంధాలుంటాయి
నమ్మకమైన నడతలుంటాయి 

గతం గట్టిగా పెనవేసుకుంటే
చెప్పుకున్న మాటలు, చేసుకున్న వాగ్దానాలు
కలిసి నడిచిన బాటలు
కలతల గాయాలను మాన్పిన ప్రేమలు
మధురమైన కలయికలు
అన్నీ ఆశల పుట్టినిల్లులే
ఎదురుచూపులకు అర్థం, పరమార్థం
నిరీక్షణలు నెరవేరినప్పుడే ..నెరవేరినప్పుడే


Rate this content
Log in

Similar telugu poem from Classics