వేచా వేచా..మనసా వాచా..!!
వేచా వేచా..మనసా వాచా..!!


ఎదురుచూసే ఓపికికలేదని
పరవళ్లు తొక్కే పరువంతో
సాగరునితో సంగమించుటకు
ఎదురెళ్ళే నదిని చూసి
కుదురులేని ఎద ఎంత కుళ్ళుకుంటుందో తెలుసా
ఎటెల్లాలో ఎరుగక ఊరేగే
ఎదురులేని గాలి గరిమని చూసి
తహతహలాడే తపనకి తాళలేక
విరహంతో ఉక్కిరిబిక్కిరైన మది ఎంత వేగిపోతుందో తెలుసా
ఉన్నచోటనే ఉండిపోయి
ఉలుకుపలుకు వద్దనే
బండరాతి కంటే కఠినమైన దూరం
కరగదేంటని కసిరే ప్రాణమెంత పోరుపెడుతుందో తెలుసా
మీ ప్రశాంత్