Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

జాలిలేని ప్రేయసి

జాలిలేని ప్రేయసి

1 min
516


ప!!

జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు

జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు |2|

చ||

జాము రాతిరైన ఆనవాలే లేక ఆశొదలాల

గోముగా పిలిచినా పలుకవు నేనే కదలాల |2|

మందహాసం మరచి చంద్ర సాయం కోరానే

దరహాసంతో దరిచేరవా ఆ వెన్నెల తీరాన్నే|ప|

చ||

ఆనలన్ని చేసి ఆనవాయితీ మరచితివి కద

ఊసులన్ని ఊహలతో నింపి పండెనుగ ఎద |2|

కోరికలే కొత్త ఆశలతో చివురులే తొడిగాయి

తారకలే తహ తహగా ఎపుడని అడిగాయి |ప|

చ||

తొలి పలుకే తోరణమై తనువునెల్లా అల్లగా

మలి చూపులేక మదియే నీరసించే మెల్లగా |2|

మరచిపోలేవా నీవు కాలమే చేసిన గాయం

చరచి ఎదను చేయవా ఆ బాధనే మాయం ౹ప|



Rate this content
Log in

Similar telugu poem from Romance