సమీరం
సమీరం
ప౹౹
చేసిన బాసలు చెరపవద్దు ఓ చెలికాడ
చూసిన చూపులు మరువకూ సఖుడ ౹2౹
చ౹౹
ఆనాటి మాటలూ నీటిమీద అలలేనా
ఆ మేటి పాటలూ ఒట్టి పగటి కలలేనా ౹2౹
ఏమయిందో నా మనసుకూ తెలపవా
ఏమనుకోకుండా నీ ఎడదను కలపవా ౹ప౹
చ౹౹
తెమ్మెర తెరలేపే తెగువతో ఆ వలపునే
తుమ్మెద బరిలో దింప ఇచ్చే పిలుపునే ౹2౹
మరచితివ మనమనుకున్న మాటలనే
ఎరచితివా ఆలకించ ఆ ప్రేమ పాటలనే ౹ప౹
చ౹౹
ఆ వలపు ఎడారిలో వెన్నెలేగ పొసగకనే
ఆవల తీరం అలయక చేరుకో అడగకనే ౹2౹
అందివచ్చిన అవకాశం చూసే అదనులో
అంధకారమే చేయకు ఆశలుడక ఎదలో ౹ప౹