సరసాల ఉత్తరం
సరసాల ఉత్తరం


సా౹౹
పరదా చాటుకి పయనమైన నవ పడతి
సరదా సరసాల ఉత్తరమే ఇది యువతి ౹2౹
ప౹౹
అందిస్తున్నా అందుకోమనీ ఈ ఖవ్వాలి
సంధిస్తున్నా చేరుకోను నా ఘన నివాళి ౹2౹
చ౹౹
తొలిపొద్దు ఎర్రదనం ఆ చెక్కిలనంటగా
సరిహద్దు దాటి చక్కదనం ఓ మంటగా ౹2౹
గుండెనే కాల్చి మరి గుబులులే రేపిందీ
పండినా వలపునూ నిండుగ చూపిందీ ౹ప౹
చ౹౹
పరువాల చెరసాలలో పదునెక్కిన్నావే
అధరాల అందంతోనే మత్తెక్కిస్తున్నావే ౹2౹
రాత్రి మజలీని రంజిపను రమ్మాంటావా
ధాత్రి కరిగి దీవింపను చేరుకోమంటావా ౹ప౹
చ౹౹
గజ్జలరవళీ గణగణా వాహినిగాను సాగి
రజ్జులేల రవ్వంత ప్రేమ పంచాలి ఓ సాకి ౹2౹
ప్రేమ లేపనం రాయలేవా ఎద గాయాలకి
లేమ స్వాంతనమే ప్రేరణలే ఈ గేయాలకి ౹ప౹