ఆ క్షణం...
ఆ క్షణం...
మొదట సారి నీకై వెతికిన నా కళ్ళు
ఆ క్షణం కనుమరుగు అయిన నీ ప్రతిబింబం చూడగానే నా గుండెల్లో ఆగిన ఆ చివరి క్షణము జీవితంలో నేను ఎమీ కోల్పోయానో తెలియచేసాయి.
నువ్వు ఒప్పుకుంటే జీవితాంతం అను క్షణము నీతో నీలో ని ప్రతిరూపం గా నికు తోడుగా, అండగా ఒకటిగా కష్టాలు లోను భాదలోను భాద్యతగా ముందు ఉండి ని కళ్ళలో ఒక్క కన్నీటి బిందువు కూడా రానివ్వకుండా చూసుకుంటాను అని మొట్టమొదట నిన్ను చూడగానే నా మనసు నాకు చెప్పిన మాటలు అవి, కానీ ని కళ్ళలోని తెలియని ఒక చిరునవ్వు నాలోని మాటలను మొగబోయేల చేసింది.
ని కను పాపాలు చెప్పే మాటలకు నా మనసు తెలియకుండానే నీకు అంకితం అయింది.
నికై ఎదురు చూసే నా నీరక్షణ నా మనసుకి వియోగంల మారింది.
ఈ జీవితంలో ఎప్పటికి కలగదు అనుకున్న అంతర్గహత భావాలను ఒక్క సారిగా నాలో చిగురింపు చేసి నన్ను పునర్జన్మడి గా చేసావు.